హెర్డ్‌ ఇమ్యూనిటీకి అల్లంత దూరాన

ABN , First Publish Date - 2020-05-31T08:44:39+05:30 IST

సామూహిక రోగ నిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ)తోనే కరోనా వ్యాప్తికి కళ్లెం పడుతుందని పలువురు సాంక్రమిక వ్యాధి నిపుణులు చెబుతున్న మా టలపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది ఇప్ప ట్లో సాధ్యపడే విషయం కాదని...

హెర్డ్‌ ఇమ్యూనిటీకి అల్లంత దూరాన

  • ఇప్పట్లో అసాధ్యం అంటున్న సాంక్రమిక వ్యాధి నిపుణులు
  • 20 శాతం జనాభాకు ఇన్ఫెక్షన్‌ సోకిన 
  • న్యూయార్క్‌లోనే సాధ్యపడలేదని వెల్లడి


సామూహిక రోగ నిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ)తోనే కరోనా వ్యాప్తికి కళ్లెం పడుతుందని పలువురు సాంక్రమిక వ్యాధి నిపుణులు చెబుతున్న మా టలపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది ఇప్ప ట్లో సాధ్యపడే విషయం కాదని అమెరికాకు చెందిన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశ జనాభాలో 60 శాతం నుంచి 80 శాతం మందికి ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత వచ్చే సామూహిక రోగ నిరోధక శక్తి కోసం ఎదురుచూడటం మూర్ఖత్వమే అవుతుందని వారు అంటున్నారు. కరోనాతో అతి తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లోనూ సాధ్యపడని హెర్డ్‌ ఇమ్యూనిటీ.. మిగతాచోట్ల వస్తుందనుకోవడం సరికాదని చెబుతున్నారు. 


స్వీడన్‌, బ్రిటన్‌ బోల్తా.. 

స్వీడన్‌, బ్రిటన్‌ వంటి దేశాలు ఒకానొక దశలో హెర్డ్‌ ఇమ్యూనిటీకి యత్నిం చి బోల్తాపడ్డాయి. ఇందుకోసం అవి సడలింపులతో లాక్‌డౌన్‌లు అమలు చేసి, స్వేచ్ఛగా ప్రజల కదలికలకు అవకాశం కల్పించాయి. అయినా ఆ రెండు దేశాల్లో ఇప్పటివరకు సగటున 7 నుంచి 17 శాతం జనాభాకే వైరస్‌ సోకింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌ నగరంలో 11.3 శాతం మందికి, బార్సిలోనాలో 7.1 శా తం మందికి.. బ్రిటన్‌లోని లండన్‌లో 17.5 శాతం మందికి కరోనా ప్రబలింది. దీంతో సామూహిక రోగ నిరోధక శక్తి పెరగకపోగా ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి మాత్రం వేగాన్ని పుంజుకుంది. మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 


ఆ రెండు పట్టణాల్లో 40 శాతం మందికి ఇన్ఫెక్షన్‌ సోకినా.. 

మే 2 నాటికి అమెరికాలోని న్యూయార్క్‌ నగర జనాభాలో దాదాపు 20 శా తం మంది కరోనా బారినపడ్డారు. 18వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని ప్రతీ లక్ష మంది పౌరుల్లో దాదాపు 250 మంది కొవిడ్‌తో మరణించారు. అయినా హెర్డ్‌ ఇమ్యూనిటీ దరిదాపుల్లోకి కూడా న్యూయార్క్‌ చేరుకోలేకపోయింది.  న్యూయార్క్‌ నగరం కంటే బ్రూక్లిన్‌, బ్రాంక్స్‌ పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్ల రేటు రెట్టింపు స్థాయిలో(దాదాపు 40 శాతం) ఉందని సెరాలజీ సర్వే లో వెల్లడైంది. అంటే ఆ రెండు పట్టణాల పరిధిలోని జనాభాలో సగటున ప్రతీ 100 మందిలో 40 మందికి కరోనా యాంటీబాడీ లు ఉన్నాయన్న మాట. అయినప్పటికీ అక్కడి ప్రజల్లో రోగ నిరోధక శక్తి అంతగా పెరగలేదని సర్వేలో వెల్లడైంది. న్యూయార్క్‌లో కరోనా బారినపడిన వారిలో 1 శాతం మందే మరణించినట్లు గుర్తించారు. చైనాలోని వూహాన్‌ నగరంలో 10 శాతం జనాభాకు ఇన్ఫెక్షన్‌ సోకింది. అయితే అక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎంతమేర పెరిగిందో నివేదికలు ఇంకా విడుదల కాలేదు. మరణాల రేటు తక్కువగా ఉందని అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సి రావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  - సెంట్రల్‌ డెస్క్‌


Updated Date - 2020-05-31T08:44:39+05:30 IST