ఆమె సృజనే విజయానికి పెట్టుబడి

ABN , First Publish Date - 2021-01-06T05:30:00+05:30 IST

సలోనీ బాగా పేరున్న యూట్యూబర్‌. కంటెంట్‌ క్రియేటర్‌ కూడా. హజల్‌ పోస్టు అకాడమీ అనే ఆన్‌లైన్‌ అకాడమీని ప్రారంభించింది. దాని గురించి నలుగురికీ తెలియడానికి సోషల్‌ మీడియా వేదికను ఉపయోగించుకుంది.

ఆమె సృజనే విజయానికి పెట్టుబడి

రోజుకు 21 రూపాయల పెట్టుబడితో ఆన్‌లైన్‌ బిజినెస్‌ మొదలెట్టొచ్చు! ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! కానీ ఇదిగో సలోనీ శ్రీవాత్సవ చెబుతున్న మాటలు వింటే నమ్మక తప్పదు. ఆ విశేషాలు మీరే చదివేయండి.


సలోనీ బాగా పేరున్న యూట్యూబర్‌. కంటెంట్‌  క్రియేటర్‌ కూడా. హజల్‌ పోస్టు అకాడమీ అనే ఆన్‌లైన్‌ అకాడమీని ప్రారంభించింది. దాని గురించి నలుగురికీ  తెలియడానికి  సోషల్‌ మీడియా వేదికను ఉపయోగించుకుంది. తన ఆన్‌లైన్‌ అకాడమీ ద్వారా 12 కోర్సులను అందిస్తోంది. వీటిలో లైవ్‌ ఇంటరాక్షన్లు కూడా ఉంటాయి.

 

మూడు సంవత్సరాల క్రితం యూట్యూబర్‌గా చేరిన సలోనీ యువతకు ఆసక్తికరమైన ఎన్నో విషయాలు, టిప్స్‌ చెపుతూ వాళ్ల మనసులను దోచుకుంది. అలా యువతతో  ఆమెకు బంధం ఏర్పడింది. అప్పుడే ఆమె మెదడులో ఆన్‌లైన్‌ అకాడమీ ఆలోచన  రూపుదిద్దుకుంది.  సలోనీకి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటారా? యూట్యూబర్‌ అయిన సలోనీకి ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఎలా చేయొచ్చంటూ రోజూ వందల సంఖ్యలో మెయిల్స్‌ వచ్చేవట.  వాళ్లకి ఆన్‌లైన్‌ బిజినెస్‌లోని వ్యూహాలను సింపుల్‌గా ఒక మెసేజ్‌ ద్వారా చెప్పడం  సాధ్యం కాదనిపించింది సలోనీకి. దాంతో ఆన్‌లైన్‌ అకాడమీని ప్రారంభించాలనుకుంది. అలాగే చేసింది. అదీ కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఈ సాహసానికి పూనుకుంది.


దీని స్థాపన వెనుక ఆమె లక్ష్యం ఒక్కటే. సామాన్య యువతీ యువకులను సమర్థవంతమైన బిజినెస్‌ అధినేతలుగా చేయడం! లాక్‌డౌన్‌ సమయంలో కొందరు ఇంటి నుంచి ఆఫీసు పనులు చేస్తుంటే, ఇంకొందరు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేక తల్లడిల్లారు! కొవిడ్‌ నిబంధనలతో సమూహంలో పని సవాలైంది. మరికొంత మందికి పని తక్కువై వచ్చే డబ్బు సరిపోవడం లేదు. ఇవన్నీ ఎందరో చూపులను ఆన్‌లైన్‌ బిజినెస్‌ వైపు మళ్లేలా చేసింది. కానీ ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఎలా చేయాలన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని  సలోనీ సరైన సమయంలో పట్టుకుంది. ‘మై హూనా’ అంటూ  అలాంటి వారి  కోసం ఆన్‌లైన్‌ అకాడ మీని మొదలెట్టింది. ఎంతో కష్టపడింది. మూడు వారాలు నిద్ర లేకుండా గడిపి బిజినెస్‌ చేపడదామనుకునేవారికి అవసరపడే 12 రకాల కోర్సులను ప్లాన్‌ చేసి  ఆన్‌లైన్‌ అకాడమీ ద్వారా వారికి బోధించడం మొదలెట్టింది.  వీళ్లని ఆకర్షించేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజికవేదికలను  ప్రచార వేదికగా  చేసుకుంది. సుస్థిరమైన బిజినెస్‌ అవకాశాల కోసం ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించుకోవాలో వీళ్లకి అవగాహన తేవడం మొదలెట్టింది.


తొలుత తన ఆన్‌లైన్‌ అకాడమీని వన్‌ టు వన్‌ ఆలోచనతో మొదలెట్టింది. కానీ ఈ కోర్సుల్లోకి చేరుతున్న వారి సంఖ్య పెరగడంతో వన్‌ టు వన్‌ కాకుండా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వారికి ఉపయోగపడే ప్రోగ్రాములను రూపొందించింది. దాంతో ఈ వె బ్‌సైట్‌కి మంచి స్పందన వచ్చింది. నిత్యం ఆమెతో మాట్లాడే ప్రేక్షకులు పెరిగారు. ‘‘ఎలాంటి వ్యాపారం ఆన్‌లైన్‌లో చేస్తే లాభదాయకంగా ఉంటుంది? దానికి ఎలా సంసిద్ధం కావాలి? ఎలా నడపాలి? లాంటి అంశాలను తెలిపే  ఫౌండేషన్‌ కోర్సులు మా ఆన్‌లైన్‌ అకాడమీలో ప్రవేశపెట్టాం. నెలకు  ఒక్కొక్కటి చొప్పున పన్నెండు  కొత్త మినీ కోర్సులను మొదలెట్టాం. ఈ కోర్సుల సహాయంతో యూట్యూబర్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ లీవరేజర్‌గా, బిజినెస్‌ అలా ఎవరికి ఇష్టమైన కెరీర్‌ వాళ్లు ప్రారంభించవచ్చు. తమ ఆకాంక్షలను తీర్చుకోవచ్చు. ప్రాధమిక అంశాలతో మొదలెట్టి పలు బిజినెస్‌ల సాధ్యాసాధ్యాలపై  బాగా అవగాహన ఉండేలా వారిని మేం తయారుచేస్తాం. కంటెంట్‌ స్ట్రాటజీ, డిజైనింగ్‌, థంబ్‌నెయిల్స్‌ నుంచి కొత్త బ్రాండ్లు, వ్యక్తిగత బ్రాండ్‌ ఇమేజ్‌లను ఎలా పెంచుకోవాలి చెప్తాం’ అంది సలోని.


ఈ అకాడ మీని ప్రారంభించేటప్పుడు వందమంది మించి రారని సలోని భావించింది.  కానీ  కేవలం ఇరవై నాలుగు గంటల్లో వీరి సంఖ్య ఆరు వందలు అయింది. ఇది సలోనీనే ఆశ్చర్యపరిచింది. ‘‘నిజాయతీగా చెప్పాలంటే రెండు నెలల్లో మా అకాడమీలో రెండు వేల మంది చేరతారని నేను అస్సలు ఊహించలేదు అంటుంది’’ ఆమె.  అంతేకాదు ‘మేమందించే ప్రతి కోర్సులో ప్రముఖుల ఉపన్యాసాలతో కూడిన రికార్డులు ఉంటాయి. అవి మా విద్యార్థులకు ఇరవైనాలుగు గంటలూ అందుబాటులో ఉంటాయి. వాటితోపాటు అసైన్‌మెంట్లు, హోంవర్కులు ఉంటాయి. అంతేకాదు లైవ్‌ ఇంటరాక్షన్లు నిర్వహిస్తాం. గ్రూపులోని అందరూ ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకోవడమే కాదు తమలోని నైపుణ్యాన్ని కూడా తోటివాళ్లతో పంచుకునేలా మా గ్రూపు డిస్కషన్లు ఉంటాయి’ అని సలోని వివరించింది. ప్రతి వారాంతం విద్యార్థులకు లైవ్‌ కాల్స్‌ చేసి వారి సందేహాలను సలోని  తీరుస్తుంది. వారి  ప్రశ్నలకు జవాబులిస్తుంది ! ఒక్కొక్కరికీ  వారి వారి వ్యక్తిగత బిజినెస్‌  ఆలోచనలకు అనుగుణమైన సూచనలు, సలహాలు అందిస్తుంది. అకాడమీ అందించే ఈ కోర్సుల రుసుం 7,665 రూపాయలు.


ఒక సంవత్సరం పాటు వెబ్‌సైట్‌లోని సమాచారం ఆ విద్యార్థికి అందుబాటులో ఉంటుంది. లైవ్‌ సపోర్టు కూడా అకాడమీ వీరికి అందిస్తుంది. తన ఈ ఆలోచనను రోజుకు 21 రూపాయల పెట్టుబడితో  సాధ్యం చేసుకున్నానంటుంది సలోని. మార్కెట్‌లో ఇలాంటి ఆన్‌లైన్‌ అకాడమీలు ఎన్నో ఉన్నా  తమ అకాడమీ ‘క్రియేటివ్‌-డ్రివన్‌- కమ్యూనిటీ’కి అధిక ప్రాధాన్యమిస్తుంది. అందుకే ఆమె సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ అకాడమీ సక్సెస్‌ స్టోరీలు సైతం ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఇందులో శిక్షణ పొందిన ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ స్పిరుచ్యువాలిటీ, హీలింగ్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌ సేవలను అందజేయడంతో పాటు ఫ్రీలాన్స్‌ కంటెంట్‌ రైటర్‌గా కూడా సేవలు అందిస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ అకాడమీలో చేరుతున్న వారిలో ఎక్కువమంది 27-30 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారు. ‘నా పర్సనల్‌ బ్రాండ్‌ను సృష్టించాలనుకున్నా. ప్రజల మనస్సుల్లో ప్రత్యేకంగా నిలవాలనుకున్నా. సక్సెస్‌ కావాలనుకున్నా. అది సాధించాను’ అని అంటుంది సలోని. 


ఈ అకాడ మీని ప్రారంభించేటప్పుడు వందమంది మించి రారని సలోని భావించింది.  కానీ  కేవలం ఇరవై నాలుగు గంటల్లో వీరి సంఖ్య ఆరు వందలు అయింది.

Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST