భలే కోడిపిల్ల!

ABN , First Publish Date - 2021-12-06T05:30:00+05:30 IST

యెల్లో పేపర్‌ తీసుకుని రెండు సర్కిల్స్‌ గీయాలి. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా గీసుకోవాలి. .....

భలే కోడిపిల్ల!

కావలసినవి

ఆరెంజ్‌, యెల్లో పేపర్‌, గూగ్లీ కళ్లు, పెన్సిల్‌, కత్తెర, జిగురు.


ఇలా చేయాలి....

 యెల్లో పేపర్‌ తీసుకుని రెండు సర్కిల్స్‌ గీయాలి. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా గీసుకోవాలి. ఇందులో ఒకటి కోడిపిల్ల శరీరం, మరొకటి తల భాగం. ఈ రెండింటిని కట్‌ చేసుకోవాలి.

 పెద్ద వృత్తంను సరిగ్గా మఽధ్యలోకి మడవాలి. బొమ్మలో చూపించిన విధంగా రెక్కల ఆకారంలో కత్తిరించుకోవాలి.

 ఆరెంజ్‌ కలర్‌ పేపర్‌పై త్రిభుజాకారం గీసి కత్తిరించాలి. ఇది ముక్కుగా ఉపయోగపడుతుంది. అలాగే కాళ్లు కత్తిరించుకోవాలి. గూగ్లీ కళ్లు తీసుకోవాలి.

 తల భాగాన్ని శరీరానికి అతికించాలి. గూగ్లీ కళ్లు అంటించాలి. ముక్కు, కాళ్లు, కిరీటం అతికిస్తే కోడిపిల్ల బొమ్మ రెడీ.

Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST