సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తామంటున్న పోలీసులు.. సీపీ సజ్జనార్‌తో భేటీ కానున్న అవంతి

ABN , First Publish Date - 2020-09-28T18:27:08+05:30 IST

హేమంత్‌ హత్య కేసును పరువు హత్యగా గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు హేమంత్ భార్య అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.

సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తామంటున్న పోలీసులు.. సీపీ సజ్జనార్‌తో భేటీ కానున్న అవంతి

హైదరాబాద్: హేమంత్‌ హత్య కేసును పరువు హత్యగా గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు హేమంత్ భార్య అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..  అవంతి, హేమంత్‌‌ల ప్రేమ వివాహం తెలిసి ఆమె తండ్రి లక్ష్మారెడ్డి ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టించారు. 6నెలల పాటు అవంతిని బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కరెంట్‌ లేని సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కాదన్న ఆలోచనతో గత జూన్ 10న హేమంత్‌తో అవంతి ఇంటి నుంచి పారిపోయింది. హేమంత్‌ హత్య కేసులో మొత్తం 25 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను 5 రోజుల కస్టడి కోరుతూ ఎల్బీనగర్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. జహీరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ మీద సీసీ టీవీ దృశ్యాలను సేకరించిన పోలీసులు.. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్‌ రీ కన్‌స్ట్రక్చన్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను అవంతి, హేమంత్‌ కుటుంబసభ్యులు కలవనున్నారు. తమకు న్యాయం చేయాల్పిందిగా కోరనున్నామని మీడియాకు తెలిపారు.  

Updated Date - 2020-09-28T18:27:08+05:30 IST