Abn logo
Sep 27 2020 @ 14:38PM

నల్గొండలో డిగ్రీ అర్హత పరీక్ష రాసిన సినీ నటి హేమ

Kaakateeya

నల్లగొండ: విద్యార్హతలు పెంచుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని.. చదువుకోవాలనే జిజ్ఞాస ఉంటే సరిపోతుందని చాలా మంది నిరూపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కోవలో సినీ నటి హేమ చేరారు. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న ఆమె.. అర్హత పరీక్షను ఆదివారం నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో రాశారు. పరీక్ష అనంతరం ఆమె మాట్లాడుతూ..  ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని ఉందని, హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్లగొండలో పరీక్ష రాసినట్టు ఆమె తెలిపారు. ఎవరి కంటా పడకూడదని అనుకున్నా అని, అలా జరుగుతుందనే ఇక్కడ పరీక్ష రాసేందుకు వచ్చానని ఆమె అన్నారు. ప్రస్తుతం తాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని, నల్లగొండ అయితే ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు తదితరాలు ఉండటంతో ఇక్కడ పరీక్ష రాసినట్టు చెప్పారు. అంతేగాక ఎవరైనా గుర్తు పడితే... ప్రశాంతంగా పరీక్ష రాయడం కష్టమవుతుందనే ఆలోచన కూడా నల్లగొండలో పరీక్ష రాయడానికి ఓ కారణమన్నారు. ఈ ప్రాంతంలో తమకు బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement