కొవిడ్‌ బాధితుల కోసం హెల్త్‌ హెల్ప్‌లైన్‌

ABN , First Publish Date - 2022-01-24T06:26:04+05:30 IST

ప్రజారోగ్య వేదిక, ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం, మెడికల్‌ రిప్రజంటేటివ్‌ల యూనియన్‌, యూటీఎఫ్‌ తదితర సంఘాల భాగస్వామ్యంతో కొవిడ్‌ బాధితుల కోసం హెల్త్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటైంది.

కొవిడ్‌ బాధితుల కోసం హెల్త్‌ హెల్ప్‌లైన్‌
మాట్లాడుతున్న మానవత పూర్వ అధ్యక్షుడు నాగేశ్వరరావు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 23 : ప్రజారోగ్య వేదిక,  ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం, మెడికల్‌ రిప్రజంటేటివ్‌ల యూనియన్‌, యూటీఎఫ్‌ తదితర సంఘాల భాగస్వామ్యంతో కొవిడ్‌ బాధితుల కోసం హెల్త్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటైంది.ఆదివారం ఏలూరు పవరు పేటలో హెల్త్‌ హెల్ప్‌లైన్‌ కేం ద్రాన్ని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పూర్వ అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు ప్రారం భించి మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని ఏలూరు, పరిసర ప్రాంతాల ప్రజ లందరూ ఉపయోగించుకోవాలన్నారు.  ప్రజారోగ్య వేదిక నాయకుడు వీవీఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఈఎన్‌టీ, జనరల్‌ ఫిజీషియన్‌, పీడీయాట్రిక్స్‌, గైనకాలజీ, డెంటల్‌, మధుమేహ వైద్య నిపుణులు ఈ కేంద్రంలో నిరంతరం వైద్య సలహా అందిస్తార న్నారు. ఏవీఆర్‌ ప్రతినిధి కె.రామాంజనేయులు మాట్లాడుతూ కరోనా మూడో దశ ఉధృతి ప్రారంభమైన నేపథ్యంలో హెల్త్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏవీఆర్‌  కార్యదర్శి గుడిపాటి నరసింహా రావు మాట్లాడుతూ హెల్త్‌ హెల్ప్‌లైన్‌లో సేవలు పొందేందుకు  98854 11608, 98668 60131, 97014 07027, 85000 12122, 94911 45702, 95156 46822 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. యూటీఎఫ్‌ నాయకుడు జి.రంగమోహన్‌ మాట్లాడుతూ కరోనా మొదటి దశలో నిత్యావసర సరుకుల పంపిణీ, రెండో దశలో ఐసొలేషన్‌ సెంటర్‌ను నిర్వహించామ న్నారు. మెడికల్‌ రిప్రజంటేటివ్‌ల సంఘ కార్యదర్శి సీహెచ్‌.సీతయ్య, సీఐటీయు నాయకుడు పి.కిషోర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T06:26:04+05:30 IST