ఉక్రెయిన్‌లోని తెలుగు వారి సమాచారం కోసం ఏపీ హెల్ప్‌లైన్ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-02-25T18:53:30+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా రెండూ రోజూ యుద్ధం చేస్తోంది. దీంతో అక్కడి పౌరులే కాకుండా....

ఉక్రెయిన్‌లోని తెలుగు వారి సమాచారం కోసం ఏపీ హెల్ప్‌లైన్ ఏర్పాటు

అమరావతి : ఉక్రెయిన్‌పై రష్యా రెండూ రోజూ యుద్ధం చేస్తోంది. దీంతో అక్కడి పౌరులే కాకుండా.. అక్కడుంటున్న ఇతర దేశాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో.. ఎటువైపు నుంచి బాంబుల మోతలు మోగుతాయో తెలియని పరిస్థితి. అయితే ఇండియాకు చెందిన ప్రజలు, విద్యార్థులను సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని తెలుగు వారి సమాచారం కోసం జగన్ సర్కార్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఏపీ హెల్ప్‌లైన్ నెంబర్‌ 0863- 2340678 అని ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ఈ మెయిల్ helpline@apnrts.com ద్వారా తెలుగు ప్రజలు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు.


మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు శుక్రవారం-శనివారం రాత్రి 2 గంటలకు రెండు విమానాలను భారత ప్రభుత్వం పంపిస్తోంది. బుకారెస్ట్ మీదుగా భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు రెండు ఎయిరిండియా విమానాలు బయల్దేరుతాయి. ఇండియన్ ఇవాక్యుయేషన్ టీమ్స్ రుమేనియా సరిహద్దులకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది.

Updated Date - 2022-02-25T18:53:30+05:30 IST