Parents Searching for Son: 11 ఏళ్లుగా పోలీసులు పట్టించుకోవడం లేదు.. నా కొడుకును కనిపెట్టండంటూ కోర్టుమెట్లెక్కిన తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2022-07-29T21:44:00+05:30 IST

పదకొండేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు..

Parents Searching for Son: 11 ఏళ్లుగా పోలీసులు పట్టించుకోవడం లేదు.. నా కొడుకును కనిపెట్టండంటూ కోర్టుమెట్లెక్కిన తల్లిదండ్రులు

పదకొండేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు.. తన కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో ఆ తల్లి గుమ్మం కూర్చుని ఎదురు చూస్తూనే ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారే అన్వేషణ సాగిస్తున్నారు.. చివరకు కోర్టును ఆశ్రయించారు.. విచారించిన కోర్టు తప్పిపోయిన వ్యక్తి గురించి సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించింది.. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. 


ఇది కూడా చదవండి..Viral Story: 90 ఏళ్ల వయసులోనూ వెనకడుగు వేయని బామ్మ.. ఆమె ఔదార్యానికి నెటిజన్లు ఫిదా!


ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు సమీపంలోని గడ్లా గ్రామానికి చెందిన ప్రవేశ్ త్యాగి పెద్ద కొడుకు మోహిత్ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. 2011 మార్చి 16న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మోహిత్ గురించి ఎలాంటి సమాచారమూ లేదు. ప్రవేశ్, ఆయన భర్య.. కొడుకు కోసం ఎంతగానో వెతికారు. ఫలితం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ తల్లిదండ్రుల గోడు వినిపించుకోలేదు. ఎంతగా అభ్యర్థించినా పోలీసులు మోహిత్ గురించి పట్టించుకోలేదు. చేతికి అంది వచ్చిన కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రలు తల్లిడిల్లుతున్నారు. 


ఏ క్షణంలోనైనా తన కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో తల్లి తార ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు గుమ్మంలో కూర్చుని ఎదురు చూస్తుంటుంది. మోహిత్ ఎక్కడున్నాడో తనకు తెలియదని, అయితే తన జీవితంలో చివరి రోజు వరకు అతని కోసం వెతుకుతూనే ఉంటానని తండ్రి ప్రవేశ్ చెప్పాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో మోహిత్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారించిన కోర్టు.. మోహిత్ గురించి అన్వేషణ సాగించాలని పోలీసులను ఆదేశించింది.  

Updated Date - 2022-07-29T21:44:00+05:30 IST