పేదలను ఆదుకోవడం అభినందనీయం : విప్‌

ABN , First Publish Date - 2020-04-10T11:29:35+05:30 IST

ప్రస్తుత విపత్కర పరిస్థి తుల్లో నిరుపేదలను అ న్ని రంగాల్లో ఆదుకోవ డం అభినంద నీయమని ప్రభుత్వ విప్‌ గంప

పేదలను ఆదుకోవడం అభినందనీయం : విప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌9: ప్రస్తుత విపత్కర పరిస్థి తుల్లో నిరుపేదలను అ న్ని రంగాల్లో ఆదుకోవ డం అభినంద నీయమని ప్రభుత్వ విప్‌ గంప గోవ ర్ధన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్‌ హాల్‌లో గురువా రం అయ్యప్ప అన్నదాన సమితి ఆధ్వర్యంలో ప్రతి రోజు పులిహోర, నీటి ప్యాకెట్లను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి ఈ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవాలని కోరారు.


వంద మంది మున్సిపల్‌ పారి శుధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్‌ అందజేశారు. కామారెడ్డి నియోజ కవర్గంలో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, కామారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గట్టగోని గోపిగౌడ్‌, ఎంపీపీ ఆంజనేయులు, టీ ఆర్‌ఎస్‌ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్‌ చీల ప్రభాకర్‌, అయ్యప్ప అన్నప్రసాద కమిటీ చైర్మన్‌ ముప్పారపు ఆనంద్‌, కౌన్సిలర్లు అంజల్‌రెడ్డి, లక్ష్మీనారా యణ, రాజు, పిట్ల వేణుగోపాల్‌, ప్రభాకర్‌రెడ్డి, రాంకుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


అభాగ్యులకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఎల్లారెడ్డి టౌన్‌ : కరోనా వైరస్‌ వ్యాధి నిరో ధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఇచ్చిన ఆదేశాలతో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేప థ్యంలో గురువారం ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని పలు కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛం ద సంస్థల ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసరాల సరు కులను, శానిటైజర్లను, మాస్కులను పంపిణీ చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వ ర్యంలో మున్సిపల్‌ కార్మికులకు ఉచితంగా బియ్యం, నిత్యావసరాల సరుకులను ఆర్డీవో దేవేందర్‌ రెడ్డి, డీఎస్పీ శశాంక్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, సీఐ రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఖమర్‌ అహ్మద్‌, ఎస్సై శ్వేత పంపిణీ చేశారు.


సుభాష్‌రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణం లోని 6వ వార్డులో జడ్పీటీసీ ఊషాగౌడ్‌, కౌన్సిల ర్లు బాలమణి, మహేశ్వరి విద్యాసాగర్‌, గాదే విజయ లక్ష్మీ తిరుపతి 60మంది పారిశుధ్య కార్మికులు, పేద ప్రజలకు బియ్యం, వంట నూనె, కూరగాయలు, ఉల్లిపా యలు అందించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇమ్రాన్‌ 3వ వార్డు యూత్‌ సభ్యుల ఆధ్వర్యంలో పేదలకు నిత్యా వసరాల వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. తెలంగాణ తల్లి ప్రాంగణంలో జర్నలిస్టులు అన్నదానం కొనసాగించారు. 

Updated Date - 2020-04-10T11:29:35+05:30 IST