Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యా కానుకతో విద్యార్థులకు చేయూత: ఎమ్మెల్యే బూడి

మాడుగుల: విద్యాభివృద్ధికి విద్యా కానుక పథకం ఎంతో తోడ్పడుతుందని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. సోమవారం డి.సురవరం కస్తూర్బా పాఠశాలలో విద్యా కానుక పథకం కింద బ్యాగులు, పుస్తకాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. పిల్లల చదువు కోసం ఏడాదికి రూ. 15 వేలను తల్లిదండ్రులకు అమ్మఒడి పథకం కింద వసూలు చేస్తున్నదన్నారు. అనంతరం ఉపాధ్యాయ సిబ్బంది ఎమ్మెల్యే ముత్యాలనాయుడుని సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో దేముడమ్మ, పాఠశాల ఎస్‌వో విజయ, సర్పంచ్‌ జయమ్మ, వైసీపీ నాయకులు తాళ్లపురెడ్డి రాజారాం, పాము వెంకటరావు పాల్గొన్నారు. వీరవిల్లి అగ్రహారం స్కూల్లో 75 మందికి విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం రమణ పాల్గొన్నారు. 


చీడికాడ: తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను దూరం చేయవచ్చునని ఎంపీడీవో జయప్రకాశరావు అన్నారు. సోమవారం మంచాల మోడల్‌ స్కూల్‌లో 380 మంది విద్యార్థులకు విద్యాకానుకను పాఠశాలలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాలకు వచ్చే విద్యార్థులు అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కె.గంగరాజు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వెంకటలక్ష్మి, చైర్మన్‌ అప్పలనాయుడు, వైసీపీ  నాయకుడు లాలం జానకీరామ్‌ పాల్గొన్నారు.


దేవరాపల్లి: విద్యా రంగానికి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు అన్నారు. అంబేడ్కర్‌ కాలనీలోని ఎంపీపీ పాఠశాల-2లో సోమవారం విద్యాకానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా నాడు-నేడు పథకంలో అభివృద్ధి చేశారన్నారు. తహసీల్దార్‌ రమేశ్‌బాబు, ఎంపీడీవో సుబ్బలక్ష్మి, ఎంఈవో రవీంద్రబాబు, వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సింహాచలంనాయడు, సర్పంచ్‌ ఎస్‌.పెంటమ్మ, వైసీపీ మండల అధ్యక్షుడు బాబూరావు పాల్గొన్నారు. 


కె.కోటపాడు: పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని వైసీపీ మండల అధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్‌ అన్నారు. గొంపవానిపాలెం పాఠశాలలో విద్యాకానుకలను ఎమ్మెల్యే కుమార్తె ఈర్లె అనూరాధ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.శచీదేవి,  ఎంఈవో టి.మధుమూర్తి, ఎస్‌ఐ జి.గోపాలరావు, ఉప సర్పంచ్‌ బి.ముత్యాలనాయుడు, బీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా, అన్ని పాఠశాలల్లో 60 శాతం మంది హాజరైనట్టు ఎంఈవో మధుమూర్తి తెలిపారు. 


Advertisement
Advertisement