పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి

ABN , First Publish Date - 2021-10-23T04:48:00+05:30 IST

ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) రెక్టార్‌ ఎం. చంద్రయ్య పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి
మొక్కలు నాటుతున్న వీఎస్‌యూ, యోగివేమన, పద్మావతి మహిళా యూనివర్సిటీల అధికారులు

వీఎస్‌యూ రెక్టార్‌ చంద్రయ్య

వెంకటాచలం, అక్టోబరు 22 : ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతగా మొక్కలు నాటి  పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) రెక్టార్‌ ఎం. చంద్రయ్య పిలుపునిచ్చారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో శుక్రవారం క్లీన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా యోగివేమన, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల అధికారులతో కలిసి వీఎస్‌యూ రెక్టార్‌ చంద్రయ్య, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి తదితరులు మొక్కలు నాటారు. ఈసందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ వీఎస్‌యూలో పచ్చదనాన్ని పరిరక్షించడంలో ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది, వలంటీర్ల సేవలు అమోఘమని ప్రశంసించారు. కార్యక్రమంలో యోగివేమన యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డి. విజయ రాఘవప్రసాద్‌, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డీఎం మమత, యోగివేమన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఎన్‌. ఈశ్వర్‌రెడ్డి, వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డీనేటర్‌ డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌, డిప్యూటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ సాయిప్రసాద్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ వై. విజయ, పీఆర్‌వో డాక్టర్‌ నీలమణికంఠ, డిప్యూటీ వార్డెన్‌ డాక్టర్‌ ఆర్‌. మధుమతి, ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది ఉస్మాన్‌ అలీ, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:48:00+05:30 IST