విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి దివ్యాంగులు వచ్చారు. వారి వినతులను పవన్ స్వీకరించారు. నేలపై కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల ఇబ్బందులు వర్ణించలేనివన్నారు. కొందరు కండరాల క్షీణతతో వీల్ చైర్‌కే పరిమితం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అమరావతిలో రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాలో కేంద్రాలు పెట్టి.. జీవనోపాధి మార్గాలను చూపాలన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద దివ్యాంగులకు ఆర్థిక సాయం చేయాలని, కేంద్రం ఆమోదించిన ప్రకారం రూ. 15వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు.
ఇవి కూడా చదవండి