ఎలాగైనా పోరాడి... మా అమ్మానాన్నలకు సాయపడాలనుంది...

ABN , First Publish Date - 2021-10-18T20:43:30+05:30 IST

నాకు చావాలని లేదు.... ఈ క్యాన్సర్‌తో పోరాడాలని ఉంది. నాకు సాయం చెయ్యండి....

ఎలాగైనా పోరాడి... మా అమ్మానాన్నలకు సాయపడాలనుంది...

నాకు చావాలని లేదు.... ఈ క్యాన్సర్‌తో పోరాడాలని ఉంది. నాకు సాయం చెయ్యండి.


నా పేరు యశ్వంత్. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వాసిని. నాకు ఈ సమస్య రావడానికి ముందు అందరిలా చదువుకుంటున్న 10 ఏళ్ళ బాలుడిని. నా స్నేహితులతో ఆడుకుంటూ, బడికి వెళుతూ ఆనందిస్తుండేవాడిని.


అయితే, గత మే నెలలో నాకు అనారోగ్యం మొదలైంది. ఒక రోజు మధ్యాహ్నం వేళ జ్వరం వచ్చి దాదాపు 15 రోజులైనా తగ్గలేదు. వాంతులవుతుండటంతో బాగా నీరసించిపోయాను.


మా అమ్మానాన్నా ఎంతో ఆందోళనతో నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వరుసగా స్కానింగులు, పరీక్షలు చేసి, చివరకు నేను myelodysplastic syndrome అనే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని చెప్పారు.



ఒకవైపు నాకు చికిత్స జరుగుతున్నప్పటికీ, ఆ చికిత్సకు నా శరీరం నుంచి సానుకూల స్పందనలేవీ రావడం లేదు. అయితే, నాకు కచ్చితమైన స్వస్థత చేకూరాలంటే ట్రాన్స్‌ప్లాంట్ జరగాల్సి ఉందని డాక్టర్లు తెలియజేశారు.


డాక్టర్ల మాటలతో... కనీసం ఏదో ఒక మార్గం ద్వారా నా ఆరోగ్యం మెరుగయ్యే అవకాశముందని మా అమ్మానాన్నా కాస్త ఆశపడ్డారు. ఆందోళన పడవద్దని నాకు చెప్పి, డబ్బు కోసం చెయ్యగలిగిందంతా చేస్తామని అన్నారు.


కానీ, వైద్యానికి దాదాపు రూ.20 లక్షలు ($ 26915.42) ఖర్చవుతుందని తెలిసింది. మా అమ్మానాన్న వాళ్లకున్నదంతా నా చికిత్స కోసం ఖర్చుపెట్టేశారు. ఇప్పుడు వాళ్లదగ్గర ఇంకేం లేదు. నా తల్లిదండ్రులను నిస్సహాయ స్థితిలో పడేశానని నాకు విచారం ఇంకా రెట్టింపయ్యింది.


ఇప్పుడు నాకు, మా కుటుంబానికి మీ అందరి సాయం కావాలి. నా వైద్యం కోసం పెద్ద మనస్సుతో సహాయం చెయ్యండి.


ఈ క్యాన్సర్‌తో పోరాడి, జీవించాలని నేను కోరుకుంటున్నాను. బాగా చదువుకుని మా అమ్మానాన్నలకు సాయపడాలనుకుంటున్నాను. అయితే, ఇదంతా మీ సహకారం లేకుండా సాధ్యం కాదు. దయచేసి సాయపడండి.


ఈ లింక్‌పై క్లిక్ చేసి యశ్వంత్‍‌కు పెద్దమనస్సుతో సాయం చెయ్యండి...



నాకు అంతగా అర్థం కాలేదు గానీ, క్యాన్సర్ అనే పదం మాత్రం నాకు వినిపించింది. అది నాకు చెడు చేసేదని మాత్రం తెలుసుకోగలిగాను. అ తర్వాత నేను వరుసగా ఎన్నో మెడికేషన్స్, ట్రీట్మెంట్ ప్రోసీజర్స్ చేయించుకోవలసి వచ్చింది. ఫలితంగా నేను చాలా బలహీనపడి, అలసిపోయాను. బడికి వెళ్లడం మానేసి ఆస్పత్రిలో చేరాను.


నా కుటుంబానికి ఏమంతగా అర్థిక స్తోమత లేదు. నాకు ట్యూషన్ ఫీజు కట్టడానికి మా అమ్మానాన్నలు నెలల తరబడి కష్టపడ్డారు. ఎన్ని సమస్యలున్నప్పటికీ నాకు చికిత్స చేయించడానికి మా నాన్నగారు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు అడిగి తీసుకువచ్చారు.


మా నాన్న నెలకు రూ.6000 మాత్రమే సంపాదిస్తున్న ఒక కూలీ.


ఈ లింక్‌పై క్లిక్ చేసి యశ్వంత్‍‌కు పెద్దమనస్సుతో సాయం చెయ్యండి...

Updated Date - 2021-10-18T20:43:30+05:30 IST