పెద్దమనసు చేసుకోండి... అస్లాను ఆదుకోండి!

ABN , First Publish Date - 2021-04-06T21:52:33+05:30 IST

తల్లిని అవ్వాలని నేను ఎంతో కాలంగా తపిస్తున్నాను. సంతానం కోసం అల్లాను తీవ్రంగా ప్రార్థిస్తూనే ఉన్నాను. పలుమార్లు గర్భం వచ్చి పోతూ ఎన్నో కష్టాల తర్వాత చివరికి అల్లా కరుణ నాపై కురిసింది....

పెద్దమనసు చేసుకోండి... అస్లాను ఆదుకోండి!

తల్లిని అవ్వాలని నేను ఎంతో కాలంగా తపిస్తున్నాను. సంతానం కోసం అల్లాను తీవ్రంగా ప్రార్థిస్తూనే ఉన్నాను. పలుమార్లు గర్భం వచ్చి పోతూ ఎన్నో కష్టాల తర్వాత చివరికి అల్లా కరుణ నాపై కురిసింది. నేను తల్లినయ్యాను. నా సంతోషానికి అవధులు లేవు.


కానీ, కొద్ది రోజుల్లోనే నేను నా మాతృత్వపు మధురమైన దినాలకు ముగింపు వచ్చింది. నా కొడుకు అస్లా ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంది. అయినప్పటికీ, వాడు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కుంటూనే ఉన్నాడు.


కేవలం రెండు సంవత్సరాల వయసుకే అస్లా తీవ్రమైన అనారోగ్యం బారిన పడి సర్జరీలు చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అతి తీవ్రమైన పరిస్థితి ఎదురైంది. వాడు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఇన్ఫెక్షన్‌కి గురయ్యే దారుణ పరిస్థితికి చేరవయ్యాడు.


మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు అస్లా భరించలేని మంటను అనుభవించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని డాక్టర్లు bilateral vesico ureteric refluxతో కూడిన Anorectal malformationగా తేల్చారు.


నా కొడుకు మూత్రవిసర్జన చెయ్యాల్సినప్పుడల్లా వాడి కంట కన్నీరు వరదలా పారుతోంది... మందులివ్వడానికి, ఇంజక్షన్ చెయ్యడానికి నర్సు వచ్చినప్పుడల్లా వాడు ఎంతో భయపడుతున్నాడు. ఇవన్నీ చూచి నేను దుఃఖించడం, రోదించడం తప్ప మరేమీ చెయ్యలేకపోతున్నాను.


ఇప్పటి వరకూ అస్లా కనీసం ఒక్క సంవత్సర కాలమైనా పూర్తిగా ఇంట్లో గడపలేదు. వాడి జీవితమంతా ఆసుపత్రుల చుట్టూ తిరగడం, పరీక్షలు చేయించుకోవడంతోనే సరిపోయింది.


ఎన్నో కష్టాలు, ప్రార్థనల మధ్య నాకు వాడు పుట్టాడు. ఆ భగవంతుడు నా కొడుకు కోసం ఏదో నిర్ణయించాడని మాత్రం నేను హృదయపూర్వకంగా నమ్ముతూ వచ్చాను.


కానీ ఇప్పుడు, నా కొడుకు ఎలాగైనా కోలుకుని మామూలు జీవితం గడిపితే చాలని ప్రార్థనలు చేస్తున్నాను.


దశలవారీ సర్జరీ, మందుల వాడకంతో అస్లా పరిస్థితి మెరుగుపరుస్తుందని డాక్టర్లు చెప్పారు. ఆ మాట నాలో ఆశల్ని చిగురింపజేసింది. కానీ, అందుకయ్యే ఖర్చు వినగానే ఆశలు నీరుగారాయి. సుమారుగా రూ. 20 లక్షలు ($ 27515.74) ఖర్చవుతుందని అంచనా వేశారు.


ఇంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక అర్థం కాక ఎంతో సతమతమవుతున్నాము. మా జీవితంలో ఏనాడు అంత డబ్బును ఊహించలేదు.


మాకున్న కొద్దిపాటిది ఏదైనా ఇప్పటికే అయిపోయింది. వచ్చే పూట తినడానికి డబ్బు ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఒక రేషన్ షాపు నుంచి వచ్చే దానిపైనే ఆధారపడి బతుకుతున్నాం. నా కొడుకును ఆసుపత్రిలో చేర్చడానికి మా బంధువులు కాస్త సాయం చేశారు. కానీ, ఇప్పుడు ఇంకాస్త సాయం పొందడానికి మా ముందు మార్గాలేమీ లేవు.


ఇప్పుడు నేనేం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నాను. మీ దయార్ద్ర హృదయం మాత్రమే నాకున్న ఏకైక ఊరట. దయచేసి పెద్ద మనసుతో నా కొడుకు అస్లా చికిత్సకు సాయం చెయ్యండి. వాడు మామూలు జీవితం గడుపుతాడనే భరోసా కల్పించండి.



మీ సహృదయతను చాటుకోండి. ఈ బిడ్డను ఆదుకోండి. విరాళాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2021-04-06T21:52:33+05:30 IST