బ్రిటన్‌లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-04-03T13:09:35+05:30 IST

ఉన్నత విద్య కోసం బ్రిటన్‌ వెళ్లిన 300 మంది భారత విద్యార్థులు కరోనా విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తిచేశారు.

బ్రిటన్‌లో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను ఆదుకోండి

విదేశాంగమంత్రికి పవన్‌కల్యాణ్‌ లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోసం బ్రిటన్‌ వెళ్లిన 300 మంది భారత విద్యార్థులు కరోనా విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్‌ ద్వారా విదేశాంగ మంత్రికి లేఖ పంపారు. బ్రిటన్‌లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమ సమస్యను జనసేన పార్టీ దృష్టికి తీసుకురాగా.. పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించి కేంద్రమంత్రికి లేఖ రాశారు. గత 12 రోజులుగా వారికి సరైన ఆహారం, వసతి లేక ఇబ్బందులుపడుతున్నారని, వెంటనే స్పందించి వారికి తగిన ఆహార, వసతి సదుపాయాలు కల్పించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

Updated Date - 2020-04-03T13:09:35+05:30 IST