ఎయిరిండియా ప్ర‌మాద ఘ‌ట‌న‌: భారతీయ మిషన్లు, కమ్యూనిటీ గ్రూపుల హెల్ప్‌లైన్ నంబ‌ర్లు

ABN , First Publish Date - 2020-08-08T15:42:02+05:30 IST

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 1344 ప్ర‌మాద ఘ‌ట‌న బాధిత‌ కుటుంబాలు, ప్రయాణీకుల కోసం యూఏఈలోని భారతీయ మిషన్లు, వివిధ‌ కమ్యూనిటీ గ్రూపులు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి.

ఎయిరిండియా ప్ర‌మాద ఘ‌ట‌న‌: భారతీయ మిషన్లు, కమ్యూనిటీ గ్రూపుల హెల్ప్‌లైన్ నంబ‌ర్లు

దుబాయి: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 1344 ప్ర‌మాద ఘ‌ట‌న బాధిత‌ కుటుంబాలు, ప్రయాణీకుల కోసం యూఏఈలోని భారతీయ మిషన్లు, వివిధ‌ కమ్యూనిటీ గ్రూపులు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. దుబాయిలోని ఇండియ‌న్ కాన్సులేట్ కూడా 24 గంట‌ల నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఘ‌ట‌నకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా త‌మ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్ర‌దించాల్సిందిగా కాన్సులేట్ ట్వీట్ చేసింది. 




దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మాట్లాడుతూ "ప్రయాణీకుల గురించి సమాచారం వచ్చిన వెంటనే మేము బాధిత‌ కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతాము. అవసరమైతే కాన్సులేట్‌లో 24/7 హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తాం. మా అధికారులు మీకు సహాయం అందించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు."  అని అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింద‌ని... కేరళ ప్రభుత్వం, డీజీసీఏ సహాయక చర్యల్లో పాల్గొంటున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయన గుర్తు చేశారు.





"శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల‌కు కాన్సులేట్ కార్యాల‌యం తెరుస్తాం. ఎయిరిండియా ప్ర‌మాద ఘ‌ట‌న‌లో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలందరికీ సహాయపడటానికి మా వంతు కృషి చేస్తాము. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం త‌మ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని" కాన్సులేట్ మ‌రో ట్వీట్‌లో పేర్కొంది. 


యూఏఈలోని భారతీయ మిషన్లు, వివిధ‌ కమ్యూనిటీ గ్రూపులు ఏర్పాటు చేసిన 24/7 హెల్ప్‌లైన్ నంబర్లు:


దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా

+ 971-565463903

+ 971-543090575

+ 971-543090571

+ 971-543090572


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అబుధాబి

+97126313789


కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌

+918330052468

+914832719493


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దుబాయ్

+9714207 9444.


విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారతదేశం

+911800 118 797

+91 11 23012113

+91 11 23014104

+91 11 23017905


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, షార్జా

+971 6 5970303


ఇండియన్ అసోసియేషన్, షార్జా

+971503675770

+971504828472

+971506266546


కేఎంసీసీ

+971558703836

+971558591080

+971506502115

+971 504548359

+971504550967


ఆల్‌ కేరళ కాలేజేస్ అలూమ్ని టాస్క్‌ఫోర్స్ టీమ్‌

+971503568606

+971504941923

+971507591967

+971565457661

Updated Date - 2020-08-08T15:42:02+05:30 IST