Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెల్మెట్‌ తప్పనిసరి : సీఐ వేమారెడ్డి

తోటపల్లిగూడూరు, అక్టోబరు 21 : మోటారు బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని కృష్ణపట్నం పోర్టు సీఐ వేమారెడ్డి స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో కృష్ణపట్నం సర్కిల్‌ సీఐ  చేతుల మీదుగా టీపీగూడూరు ఎస్‌ఐ కే.ఇంద్రసేనారెడ్డి గురువారం పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మోటారు సైకిల్‌ మీద వెళుతున్నప్పుడు హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం హెల్మెట్‌ తప్పనిసరి చేసిందన్నారు.  

Advertisement
Advertisement