మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ... ఆఫర్ అదుర్స్

ABN , First Publish Date - 2020-02-17T03:54:22+05:30 IST

కరోనావైరస్ భయంతో జనం మాంసాహారం తినడం తగ్గించారు. ఈ క్రమంలో... మాంసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రత్యేకించి మటన్ ధరలు మరీనూ. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నందిగామ పాత బస్టాండ్‌ సెంటర్‌లో మటన్ షాపు వ్యాపారి ఒకరు... ఓ కొత్త ఐడియాను తెరమీదకు తెచ్చాడు.

మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ... ఆఫర్ అదుర్స్

నందిగామ : కరోనావైరస్ భయంతో జనం మాంసాహారం తినడం తగ్గించారు. ఈ క్రమంలో... మాంసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రత్యేకించి మటన్ ధరలు మరీనూ. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నందిగామ పాత బస్టాండ్‌ సెంటర్‌లో మటన్ షాపు వ్యాపారి ఒకరు... ఓ కొత్త ఐడియాను తెరమీదకు తెచ్చాడు.


తన దుకాణంలో ... ‘ఐదు కిలోల మటన్ కొంటే... ఓ హెల్మెట్ ఉచితం’ అంటూ ఓ బోర్డును ఏర్పాటు చేశాడు. తన వద్ద మటన్ ఐదు కిలోల చికెన్‌ను కొనుగోలు చేసినవారికి రూ. 500 విలువైన హెల్మెట్ ‌ను ఇస్తానన్నది ఆ బోర్డు సారాంశం. ఆ బోర్డును పెట్టిన తర్వాత చికెన్ అమ్మకాలు పెరిగాయని చెబుతున్నాడు ఆ వ్యాపారి.  

Updated Date - 2020-02-17T03:54:22+05:30 IST