హెలికాప్టర్‌ ప్రమాదస్థలం వద్ద పర్యాటకుల రద్దీ

ABN , First Publish Date - 2021-12-29T15:49:17+05:30 IST

నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో నంజప్పసత్రంలో హెలి కాప్టర్‌ ప్రమాదానికి గురైన స్థలాన్ని చూసేం దుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. నంజ ప్పసత్రంలో ఈనెల 8వ తేదీ జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో

హెలికాప్టర్‌ ప్రమాదస్థలం వద్ద పర్యాటకుల రద్దీ

పెరంబూర్‌(చెన్నై): నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో నంజప్పసత్రంలో హెలి కాప్టర్‌ ప్రమాదానికి గురైన స్థలాన్ని చూసేం దుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. నంజ ప్పసత్రంలో ఈనెల 8వ తేదీ జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ సహా 14 మంది మృతిచెందారు. అనంతరం ఈ ప్రాంతాన్ని సైనిక, వైమానిక దళాలు అదుపులోకి తీసుకొని, చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరినీ అనుమతించలేదు. అలాగే, ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ శకలాలను కోయంబత్తూర్‌ జిల్లాలోని సూలూరు వైమానిక దళ కేంద్రానికి తరలించే పనులు ఆదివారం సాయంత్రంతో పూర్తికావడంతో, ఆ ప్రాంతం నుంచి సైనిక దళాలు వైదొలిగాయి. ఈ నేపథ్యంలో, ఊటీని సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన ప్రాంతాలను వీక్షిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.

Updated Date - 2021-12-29T15:49:17+05:30 IST