Russia: సరస్సులో కూలిన హెలికాప్టర్

ABN , First Publish Date - 2021-08-12T13:05:21+05:30 IST

రష్యా దేశంలో 16మంది ప్రయాణికులతో ఉన్న హెలికాప్టర్ గురువారం ప్రమాదవశాత్తు సరస్సులో కుప్పకూలిపోయింది....

Russia: సరస్సులో కూలిన హెలికాప్టర్

9 మంది సజీవం

మాస్కో (రష్యా): రష్యా దేశంలో 16మంది ప్రయాణికులతో ఉన్న హెలికాప్టర్ గురువారం ప్రమాదవశాత్తు సరస్సులో కుప్పకూలిపోయింది.రష్యా దేశంలోని తూర్పున ఉన్న కమ్చట్కా ద్వీపకల్పంలో మి-8 హెలికాప్టర్ కూలిపోయింది. క్రోనోట్స్కీ ప్రకృతి రిజర్వులోని కురిల్ సరస్సులో కూలిన హెలికాప్టరులో 13మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. హెలికాప్టరు కూలిన వెంటనే 40 మంది సహాయసిబ్బంది, డ్రైవర్లు సంఘటన స్థలానికి వచ్చి సహాయ పనులు చేపట్టారు. 


హెలికాప్టరు కూలిన ప్రాంతంలో 9మంది వ్యక్తులు సజీవంగా ఉన్నారని, గాలింపు కొనసాగుతోందని రష్యా అధికారులు చెప్పారు. వాయు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు, వాయు ప్రమాదంపై రష్యన్ దర్యాప్తు కమిటీ విచారణ చేపట్టింది.విట్యాజ్ ఏరో హెలికాప్టర్ పర్యాటకులను పెట్రోపావ్లోవ్స్క్ కమ్చాట్స్కీ నగరానికి తరలిస్తోంది. అగ్నిపర్వతాలు,ప్రకృతి దృశ్యాలను సందర్శనకు పర్యాటకులు కమ్చాట్స్కీకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.రష్యాలో జులై నెలలోనూ విమానం కూలి 19 మంది మరణించారు.విమాన భద్రతా నియమాలు సరిగా పాటించక పోవడం వల్ల రష్యాలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated Date - 2021-08-12T13:05:21+05:30 IST