హెలికాప్టర్‌ రెడీ

ABN , First Publish Date - 2022-02-27T14:02:51+05:30 IST

తేని జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించాలనుకుంటున్నారా?.. అయితే అక్కడ ఓ హెలికాప్టర్‌ కూడా మీ కోసం ఎకదురు చూస్తుంటుంది. ఓ ప్రైవేటు సంస్థ పర్యాటకులను ఆకర్షించేందుకు దీనిని సిద్ధం చేసింది. తేని జిల్లా

హెలికాప్టర్‌ రెడీ

               - తేని జిల్లాలో పర్యాటకులకు అరుదైన సదుపాయం


చెన్నై: తేని జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించాలనుకుంటున్నారా?.. అయితే అక్కడ ఓ హెలికాప్టర్‌ కూడా మీ కోసం ఎకదురు చూస్తుంటుంది. ఓ ప్రైవేటు సంస్థ పర్యాటకులను ఆకర్షించేందుకు దీనిని సిద్ధం చేసింది. తేని జిల్లా పెరియకుళం బైపాస్ రోడ్డు లక్ష్మీపురంలో ‘కట్సీ అడ్వెంచర్స్‌ హెలీపాడ్‌’ అనే ప్రైవేటు సంస్థ ఆ జిల్లాపరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించటానికి బెల్‌ 407 మోడల్‌ హెలికాప్టర్‌ సర్వీసును ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ... తాను వైమానిక దళంలో పనిచేశానని, ట్రెక్కింగ్‌లో శిక్షణ పొంది పలు పతకాలు గెలుచుకున్నానని తెలిపారు. పెరియకుళంలోని లక్ష్మీపురంలో ఈ హెలికాప్టర్‌ సర్వీసును ప్రారంభించామని, అక్కడ ప్రత్యేకంగా ఓ హెలిపాడ్‌ను కూడా నిర్మించామని చెప్పారు. ఐదుగురు మాత్రమే ప్రయాణించడానికి వీలున్న ఈ హెలికాప్టర్‌ ద్వారా వైగై డ్యామ్‌, మంజలారే డ్యామ్‌, కుంభకరై జలపాతం, సోత్తుపారై డ్యామ్‌, పడమటి కనుమల పర్వత ప్రాంతాలను చూపిస్తామని తెలిపారు. రోజూ సాయంత్రం నాలుగు గంటల వరకు 16 ట్రిప్పులు చొప్పున పర్యాటకులను హెలికాప్టర్‌లో తీసుకెళతామని ఆయన వివరించారు. ఈ హెలికాప్టర్‌ను పర్యాటకుల కోసమే కాకుండా అత్యవసర ఎయిర్‌ అంబులెన్స్‌గాను ఉపయోగిస్తామన్నారు. వరదలు, తుఫాను సమయాల్లో బాధితులను ఆదుకునేందుకు కూడా ఈ హెలికాప్టర్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయని తెలిపారు. రెండు డోస్‌ల కరోనా నిరోధక టీకాలు వేసుకున్నవారినే హెలికాప్టర్‌లో ప్రయాణించేందుకు అనుమతిస్తామన్నారు. గత వారం తమ సంస్థ ద్వారా తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బెంగళూరు ఆస్పత్రిలో రోగికి అమర్చేందుకు ఓ కంటిని శీతలీకరణ బాక్స్‌లో హెలికాప్టర్‌ ద్వారా తరలించామన్నారు.

Updated Date - 2022-02-27T14:02:51+05:30 IST