Viral Video: కరెంటు వైర్లకు తగిలిన హెలికాఫ్టర్.. వైరల్ అవుతున్న వీడియో.. అయితే అదృష్టవశాత్తూ..

ABN , First Publish Date - 2022-09-23T20:10:43+05:30 IST

ఓ హెలికాప్టర్‌ ల్యాండ్ అవుతూ హై టెన్షన్ కరెంట్ వైర్లకు తగిలింది. అయితే అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. అ

Viral Video: కరెంటు వైర్లకు తగిలిన హెలికాఫ్టర్.. వైరల్ అవుతున్న వీడియో.. అయితే అదృష్టవశాత్తూ..

ఇంటర్నెట్ డెస్క్: ఓ హెలికాప్టర్‌(Helicopter) టేకాఫ్ అవుతూ హై టెన్షన్ కరెంట్ వైర్లకు తగిలింది. అయితే అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. అసలు ఈ ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుంది? ఎలా చోటు చేసుకుంది? ప్రమాద సమయంలో ఎంత మంది ప్రయాణికులు హెలికాప్టర్‌లో ఉన్నారు అనే పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..



హెలికాప్టర్(Helicopter) ప్రమాదం బ్రెజిల్‌(Brazil)లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులుతో కూడిన హెలికాప్టర్ మినాస్ గెరైస్ రాష్ట్రంలో టేకాఫ్ అవుతుండగా.. అక్కడున్న విద్యుత్ తీగలకు తగిలి కింద పడిపోయింది. మంటలు చెలరేగకముందే ఫైలెట్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా.. వెంటనే స్పందించిన రెస్క్యూ టీం.. అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులందరినీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకు ఎటువంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. హెలికాఫ్టర్‌పై ఫైలెట్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా.. ప్రస్తుతం హెలికాప్టర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Viral in social media) అవుతోంది.


Updated Date - 2022-09-23T20:10:43+05:30 IST