Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెలికాప్టర్‌ ప్రమాదం జీర్ణించుకోలేనిది

ఆమనగల్లు : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం జీర్ణించుకోలేనిదని, ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ సహా 13మంది  మరణం దేశానికి తీరని లోటని ఏబీవీపీ నాయకులు అన్నారు. బుధవారం రాత్రి ఆమనగల్లు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి గోరటి భరత్‌, నాయకులు జల్లెల శివ, లాండెం మల్లేశ్‌, ఎం.సాయి, సురేశ్‌, కౌన్సిలర్‌ దివ్యాశ్రీకాంత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement