Abn logo
Sep 21 2021 @ 16:16PM

హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు ఆర్మీ పైలట్లు మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీకి చెందిన ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఇద్దరు ఆర్మీ పైలెట్లు మృతి చెందారు. రాష్ట్రంలోని ఉద్దాంపూర్ జిల్లా పత్నిటాప్ సమీపంలోని కొండల్లో మంగళవారం మద్యాహ్నం జరిగిందీ దుర్ఘటన. వాస్తవానికి ఆర్మీకి చెందిన ఏవియేషన్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. మృతులు మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనుజ్ రాజ్‌పుత్ అని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు హెలికాప్టర్ వద్దకు చేరుకుని పైలట్లను కాపాడే ప్రయత్నం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.