ఎత్తు 30 అడుగులు.. ఖర్చు 3 కోట్లు

ABN , First Publish Date - 2022-07-04T08:47:36+05:30 IST

ఎత్తు 30 అడుగులు.. ఖర్చు 3 కోట్లు

ఎత్తు 30 అడుగులు.. ఖర్చు 3 కోట్లు

సర్వాంగ సుందరంగా అల్లూరి కాంస్య విగ్రహం

పాలకొల్లు మండలవాసి సీతారామరాజు విరాళం 


భీమవరం, జూలై 3: ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఏడు అడుగుల పటిష్ఠమైన సిమెంట్‌ దిమ్మపై 30 అడుగుల కాంస్య విగ్రహం అమరిక పనులు వేగంగా పూర్తి చేశారు. ఈ విగ్రహం తయారీకి మూడు కోట్లు వ్యయం చేశారని కమిటీ తెలిపింది. పాలకొల్లు మండలం ఆగర్రుకు చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత మూడు కోట్లు విరాళం అందజేశారు. హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన శిల్పి బుర్రా ప్రసాద్‌ ఈ విగ్రహాన్ని 32 రోజులలో తయారు చేశారు. దీని నిర్మాణానికి 10 టన్నుల కాంస్యం మెటీరియల్‌, 7 టన్నుల స్టీలును వినియోగించారు. మన్యం వీరుడి రూపురేఖలు అచ్చుగుద్దినట్లు ఎడమ చేతిలో విల్లు, కుడిచేతిలో బాణం పట్టుకుని ఉన్నట్టుగా చక్కటి ఆహార్యంతో ఈ విగ్రహం సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహంగా ఇది రికార్డులకు ఎక్కనుంది. 


Updated Date - 2022-07-04T08:47:36+05:30 IST