Abn logo
Mar 31 2020 @ 17:37PM

హెబ్బా మరింత హాట్‌గా..!

`కుమారి21ఎఫ్` సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంది హెబ్బా పటేల్. ఓవర్‌నైట్‌లో గ్లామరస్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు దక్కించుకుంది. అయితే ఇటీవల హెబ్బా కెరీర్ నెమ్మదించింది. అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల నితిన్ `భీష్మ` సినిమాలో చిన్న పాత్ర చేసింది. 


కేవలం రెండు సీన్లలో మాత్రమే కనిపించింది. అయితే ఆ రెండు సీన్లలోనూ హాట్‌గా కనిపించింది. యంగ్ హీరో రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `రెడ్` సినిమాలో కూడా హెబ్బా కనిపించనుందట. కొన్ని సీన్లతోపాటు ఓ ఐటెం సాంగ్‌లో కూడా మెరవనుందట. ఈ ఐటెం సాంగ్‌లో హెబ్బా మరింత హాట్‌గా కనిపించనుందట. `రెడ్` సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట.

Advertisement
Advertisement
Advertisement