తెలంగాణలో భారీగా జిల్లా జడ్జీల బదిలీలు
ABN , First Publish Date - 2021-08-13T03:23:32+05:30 IST
రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జీలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 14 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నతి కల్పించింది.