బీర్భూమ్(పశ్చిమబెంగాల్): బీర్బూమ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాంపూర్హాట్ గ్రామాన్ని సందర్శించనున్నారు. సీఎం మమతా బెనర్జీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనలు జరిగిన రాంపూర్హాట్ గ్రామంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు భాదు షేక్ హత్యకు గురైన ఘటన తర్వాత 8మందిని దుండగులు కాల్చి చంపారు.రెండు వేర్వేరు ఘటనల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇద్దరు టీఎంసీ నేతలపై దాడులు జరిగాయి.మంగళవారం నాటి హింసాకాండ తర్వాత బీర్భూమ్లోని బోగ్టుయ్ గ్రామంలోని చాలా మంది నివాసితులు తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.
హుగ్లీలోని తారకేశ్వర్‌లో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ రూప సర్కార్‌ను ఓ కారు ఢీకొట్టింది.దీంతో తీవ్రంగా గాయపడిన రూపను ఆసుపత్రికి తరలించారు. రూప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి