Chittoorలో భారీగా ఎర్రచందనం పట్టివేత

ABN , First Publish Date - 2022-05-26T17:03:47+05:30 IST

జిల్లాలోని భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోటి రూపాయలు విలువచేసే 71 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Chittoorలో భారీగా ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు: జిల్లాలోని భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోటి రూపాయలు విలువచేసే 71 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

Updated Date - 2022-05-26T17:03:47+05:30 IST