కురిసిన వర్షం..తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2022-05-18T05:41:48+05:30 IST

అకాలవర్షాలు అన్నదాతలను అతులాకుతులం చేస్తున్నాయి.

కురిసిన వర్షం..తడిసిన ధాన్యం
అచ్చంపేటలో కోసిన వరి పంట నీట మునిగిన దృశ్యం

వెల్దుర్తి, మే 17: అకాలవర్షాలు అన్నదాతలను అతులాకుతులం చేస్తున్నాయి. మాసాయిపేట మండలం అచ్చంపేటలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన వరి పంట నీటమునిగింది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని నీటి నుంచి వేరు చేసి ఆరబెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అలాగే మరి కొన్ని గ్రామాలలో చేతికి వచ్చిన వరి పంట నేలమట్టమైంది. వెల్దుర్తి మండలం నెల్లూరు, హస్తాల్‌పూర్‌, ఆర్‌ఐగూడెం, ఉప్పులింగాపూర్‌ పంట నూర్పిడి చేసిన ఆరబెట్టిన ధాన్యం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యింది.  రెక్కల కష్టం నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-05-18T05:41:48+05:30 IST