Heavy rain: చెన్నైలో అర్ధరాత్రి భారీ వర్షం

ABN , First Publish Date - 2022-08-19T13:19:27+05:30 IST

చెన్నై నగరంలో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కా

Heavy rain: చెన్నైలో అర్ధరాత్రి భారీ వర్షం

                                       - విమాన రాకపోకలకు అంతరాయం


అడయార్‌(చెన్నై), ఆగస్టు 18: చెన్నై నగరంలో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా ఒక విమానం ల్యాండింగ్‌ అవలేకపోవడంతో బెంగుళూరు పంపించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెన్నై సహా పరిసర పాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చెన్నై రావాల్సిన వాటితో పాటు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాల్సిన విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. ముంబై నుంచి 132 మంది ప్రయాణికులతో వచ్చిన ఒక విమానం భారీ వర్షం కారణంగా చెన్నైలో లాండింగ్‌ కాకపోవడంతో బెంగుళూరు(Bangalore) మళ్ళించారు. అదేవిధంగా భువనేశ్వర్‌, హైదరాబాద్‌(Hyderabad) నుంచి వచ్చిన మరో రెండు విమానాలు కూడా లాండింగ్‌ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా సమయం గాల్లోనే చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత పైలట్లు చాకచక్యంగా ల్యాండింగ్‌ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-08-19T13:19:27+05:30 IST