పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు...పిడుగులు...ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-06-14T11:17:41+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలతోపాటు పిడుగుల పడే అవకాశముందని...

పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు...పిడుగులు...ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలతోపాటు పిడుగుల పడే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) సోమవారం హెచ్చరించింది. జూన్ 15, 16 తేదీల్లో ఉదయం నుంచి పంజాబ్, హర్యానా, చండీఘడ్ ప్రాంతాల్లో భారీవర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రాగల 48 గంట్లలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, పలుప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. యమునానగర్, కురుక్షేత్ర, కైథాల్, కర్నాల్, పానిపట్, గన్నౌర్, ఫతేహాబాద్, బార్వాలా, నార్వానా, రాజాండ్. అసంధ్, సాఫిడాన్, జింద్, గోహానా, హిస్సార్, హన్సీ, మేహం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2021-06-14T11:17:41+05:30 IST