ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-08-15T10:49:33+05:30 IST

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ..

ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా.. అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి అతి భారీగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. కోస్తా తీరంలో గంటకు 45-55కిలోమీటర్ల వేగంగా గాలులు, అల్పపీడనం కారణంగా ఈ నెల 16 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.  

Updated Date - 2020-08-15T10:49:33+05:30 IST