అహ్మదాబాద్: గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం ఆర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో భయానక పరిస్థితి నెలకొంది. రాజ్‌కోట్‌లోని ధోరజి, పదాద్రి, గోండల్ తాలూకాలు వరదబారిన పడ్డాయి. జామ్‌నగర్ జిల్లాతో ఖిమ్రానా గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి వరద బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. స్థానికులను ఎయిర్ లిఫ్ట్‌తో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల తాకిడితో రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అత్యున్నత సమావేశం నిర్వహించి సమీక్షిస్తున్నారు.