కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-07-09T16:24:46+05:30 IST

కామారెడ్డి జిల్లా (Kamareddy district) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జిల్లాలో వాగులు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Kamareddy: కామారెడ్డి జిల్లా (Kamareddy district) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జిల్లాలో వాగులు,చెరువులు నిండుకుండల్లా తలపిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రాహ్మణపల్లి, టేక్రియాల్, చందాపూర్, కాలోజివాడి, సంగోజివాడి, తాడ్వాయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2022-07-09T16:24:46+05:30 IST