ఉమ్మడి Warangal జిల్లా వ్యాప్తంగా Heavy Rains

ABN , First Publish Date - 2022-07-13T21:55:28+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.

ఉమ్మడి Warangal జిల్లా వ్యాప్తంగా Heavy Rains

వరంగల్ (Warangal) జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి.. చెరువులు కట్టలు తెగుతున్నాయి.. ఏజెన్సీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


ములుగు ఏజెన్సీలో చాలా గ్రామాలు అంథకారంలో మగ్గుతున్నాయి. రామప్ప, లక్కవరం, భద్రకాళీ, వడ్డెపల్లి చెరువులు అలుగుపోశాయి. మరోవైపు గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్, వాజేడు పేరూరు వద్ద గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రకాళీ చెరువు రెండు రోజులుగా అలుగుపారుతోంది. శివనగర్‌లోని నాలాలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి, కాలనీల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2022-07-13T21:55:28+05:30 IST