Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 30 2021 @ 07:23AM

Imd Warning: పలు ప్రాంతాల్లో నేడు భారీవర్షాలు

న్యూఢిల్లీ : గులాబ్ తుపాన్ ప్రభావం వల్ల గురువారం దేశంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తాజా వెదర్ బులెటిన్ లో వెల్లడించింది.గులాబ్ తుపాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో పలు చోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.దీంతోపాటు అరేబియా సముద్రంలో మరో షహీన్ తుపాన్ ఏర్పడవచ్చని వాతావరణశాఖ తెలిపింది.  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలో గురువారం నుంచి రెండురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.ఢిల్లీ నగరం మేఘావృతమైంది. గులాబ్ తుపాన్ ప్రభావం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

 పురులియా, బంకురా, పశ్చిమ బర్ధమాన్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కావడంతో అక్టోబరు మొదటివారంలో పలు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. తుపాన్ ప్రభావం వల్ల మరాఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కొంకణ్ లతో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు చెప్పారు. బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement