Eluruలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ABN , First Publish Date - 2022-07-11T14:06:34+05:30 IST

జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Eluruలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains)కు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుక్కునూరు - దాచారం గ్రామాల మధ్య గుండేటి వాగు బ్రిడ్జిపై గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కుక్కునూరు మండలంలో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దు వాగు కాజ్వేపైకి వరద నీరు చేరడంతో ఏజెన్సీలోని 15 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అటు ఎడవల్లి వద్ద కాజ్వేపై  గోదావరి వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. 

Updated Date - 2022-07-11T14:06:34+05:30 IST