ఏజెన్సీలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-24T05:28:46+05:30 IST

ఏజెన్సీలో బుఽధవారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి మఽధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే వుంది.

ఏజెన్సీలో భారీ వర్షం
సీలేరు కుండపోతగా కురుస్తున్న వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం


పాడేరు/సీలేరు/చింతపల్లి, జూన్‌ 23: ఏజెన్సీలో బుఽధవారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి మఽధ్యాహ్నం వరకు వర్షం పడుతూనే వుంది. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు ప్రాంతాల్లో భారీగా; పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పొలాల్లో నీరు చేరింది. గెడ్డల్లో నీటి ప్రవాహం పెరిగింది.  కాగా సీలేరులో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్న వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం చెందారు. చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షపు నీటితో రహదారులు వాగులను తలపించాయి.

Updated Date - 2021-06-24T05:28:46+05:30 IST