Hyderabad: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం..

ABN , First Publish Date - 2022-05-04T12:06:05+05:30 IST

నగరంలో తెల్లవారుజామున ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో రోడ్లన్నీ

Hyderabad: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం..

హైదరాబాద్‌: నగరంలో తెల్లవారుజామున ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయం మయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సైదాబాద్, చంపాపేట్, నాగోల్, కొత్తాపేట్, సరూర్‌నగర్‌, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, అల్వాల్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనూ భారీగా వర్షం పడుతోంది. ఎండవేడిమితో అల్లాడిపోతున్న నగర వాసులకు ఈ వర్షంతో ఉఫశమనం కలిగింది.


ఇక హైదరాబాద్‎లో రెండు గంటలపాటు వాన దంచికొట్టింది. సీతాఫల్‌మండిలో 7.2 సెంటి మీటర్లు, బంసీలాల్‌పేట్‌లో 6.7, వెస్ట్‌మారేడ్‌పల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్‌లో 5.6, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావునగర్‌లో 5.1, పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7, ఫలక్‌నుమాలో 4.6, గన్‌ఫౌండ్రీలో 4.4, సికింద్రాబాద్‌లో 4.3, చార్మినార్‌లో 4.2, నాచారంలో 4.1 సెం.మీ, అంబర్‌పేటలో 4.1, అమీర్‌పేటలో 3.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Read more