బెంగళూరులో భారీవర్షాలు...లోతట్టుప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2020-10-24T11:53:50+05:30 IST

భారీవర్షాలు ముంబై, హైదరాబాద్ తర్వాత బెంగళూరు నగరాన్ని అతలాకుతలం చేశాయి....

బెంగళూరులో భారీవర్షాలు...లోతట్టుప్రాంతాలు జలమయం

బెంగళూరు (కర్ణాటక): భారీవర్షాలు ముంబై, హైదరాబాద్ తర్వాత బెంగళూరు నగరాన్ని అతలాకుతలం చేశాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కురిసిన భారీవర్షాలతో పలు లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. దక్షిణ బెంగళూరు నగరంలోని గురుదత్తా లేఅవుట్, హోసకేరిహళ్లి వృషభవతి డ్రెయిన్ వరదనీటితో పొంగి ప్రవహిస్తోంది. భారీవర్షం వల్ల పలు అపార్టుమెంట్ల బేస్ మెంట్లు, లోతట్టుప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. మైసూర్ రోడ్డు, సిల్కు బోర్డు జంక్షన్, హోసూర్ రోడ్డు, బన్నేర్ ఘట్ట రోడ్డు, బసవనగుడి, నయనదాహళ్లి, ఆర్ఆర్ నగర్, బీజీరోడ్లు జలమయం అయ్యాయి. బెంగళూరులో శుక్రవారం 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోరమంగళ, బీటీఎం లేఅవుట్, జయనగర, బసవన్నగుడి, ఆర్ఆర్ నగర్, హోకేరిహళ్లి, నగరబావి, కెంగెరి, మల్లేశ్వరం ప్రాంతాలన్నీ వరదనీటిలో మునిగాయి. 

Updated Date - 2020-10-24T11:53:50+05:30 IST