red alert: మహారాష్ట్రలో 3 రోజుల పాటు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-07-22T19:12:19+05:30 IST

మహారాష్ట్రలో రాగల మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది....

red alert: మహారాష్ట్రలో 3 రోజుల పాటు భారీవర్షాలు

ముంబై (మహారాష్ట్ర):మహారాష్ట్రలో రాగల మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాల వల్ల కోస్తా కొంకణ్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర జిల్లాల్లో గురువారం భారీవర్షాలు కురిశాయి.భారీవర్షాల వల్ల కొల్హాపూర్, పంచగంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో వరదనీరు పోటెత్తడంతో సహాయ పునరావాస పనుల కోసం జాతీయ విపత్తు పరిరక్షణ దళాన్ని రంగంలోకి దించారు.ముంబై నగరంతోపాటు పలు ప్రాంతాల్లోని లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.రాయిగడ్, రత్నగిరి,పూణే సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.  ముంబై , పాల్ఘార్, థానే ప్రాంతాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. కొల్హాపూర్ వద్ద పంచగంగా నది, సాంగ్లి వద్ద కృష్ణానది వరదనీటి ప్రవాహంతో ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. సతారాలోని కోయన డ్యాం వరదనీటిని కిందకు విడుదల చేస్తోంది. ముంబైలో లోకల్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ముంబై నగరంలోని తాన్సా, మొదక్ సాగర్, తులసీ, వేహార్ జలాశయాలు వరదనీటితో నిండాయి. 


Updated Date - 2021-07-22T19:12:19+05:30 IST