TS News.. మహబూబాబాద్: ఉధృతంగా ప్రవహిస్తున్న కత్తెర వాగు

ABN , First Publish Date - 2022-08-08T17:07:06+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) వాగులు పొంగుతున్నాయి.

TS News.. మహబూబాబాద్: ఉధృతంగా ప్రవహిస్తున్న కత్తెర వాగు

మహబూబాబాద్ (Mahbubabad): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) వాగులు పొంగుతున్నాయి. కొత్తగూడ మండలం, వేలుబెల్లి గ్రామ శివారులోని వరద నీటితో కత్తెర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువనున్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసరంగా బయటకు వెళ్లే వారిని గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో సిబ్బంది వాగు దాటిస్తున్నారు.

Updated Date - 2022-08-08T17:07:06+05:30 IST