రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-10-18T09:24:01+05:30 IST

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి.

రాష్ట్రంలో మళ్లీ   భారీ వర్షాలు

వాయుగుండంగా అల్పపీడనం

నేడు, రేపు పలుచోట్ల వర్షాలు


హైదరాబాద్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా  మారిందని, దీంతో రానున్న రెండురోజులపాటు భారీ వర్షాలు కురవవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


ఆది, సోమవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర తీరప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం 8:30 గంటలకు వాయుగుండంగా మారి.. సౌరాష్ట్ర (గుజరాత్‌), ముంబైకి  వాయవ్య దిశగా, తూర్పు ఈశాన్య దిశగా కేంద్రీకృతమై ఉందని న్యూఢిల్లీలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-10-18T09:24:01+05:30 IST