Abn logo
Jul 22 2021 @ 11:17AM

కృష్ణాజిల్లాలో భారీ వర్షాలు

విజయవాడ: కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో  డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద  పట్టిసీమ వరద నీరు కృష్ణా నదికి చేరింది. దీంతో నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు పొంగిపొర్లడంతో నందిగామ, వీరులపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.