కేరళలో భారీ వర్షాలు... 4 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్...

ABN , First Publish Date - 2020-06-02T23:41:33+05:30 IST

నైరుతి రుతుపవనాలు రావడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి

కేరళలో భారీ వర్షాలు... 4 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్...

తిరువనంతపురం : నైరుతి రుతుపవనాలు రావడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళను తాకాయి. మంగళవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇండియన్ మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.


భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర రాజధాని నగరంతోపాటు చాలా చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొజిక్కోడ్, కన్నూరు, కాసర్‌గోడ్ జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాదాపు 64 మిల్లీమీటర్ల నుంచి 115 మిల్లీ మీటర్ల వర్షపాతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 


ఏడు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. 


Updated Date - 2020-06-02T23:41:33+05:30 IST