ఈదురుగాలులతో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-05-12T05:18:48+05:30 IST

రూరల్‌ జిల్లాలోని పలు పట్టణాలు, మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.

ఈదురుగాలులతో భారీ వర్షం
కశింకోటలో హోరున పడుతున్న వాన

లోతట్టు ప్రాంతాలు జలమయం
రహదారులపై ఏరులై పారిన జలం
విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
ఎండ వేడిమి నుంచి సేదదీరిన జనం

అనకాపల్లి, మే 11:
రూరల్‌ జిల్లాలోని పలు పట్టణాలు, మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ ఉరుమెలు, మెరుపుల మోస్తరు వాన పడింది. అనకాపల్లిలో ఉదయం భానుడు ప్రతాపం చూపించాడు. తరువాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి వర్షం కురిసింది. దీంతో వేడిమికి అల్లాడిన ప్రజలు సేదదీరారు.


కశింకోట: మండలంలో భారీ వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఎండతీవ్రంగా కాసింది. తర్వాత వాతావరణం చల్లబడిపోయింది. వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో సుమారు మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు మామిడి, జీడి నేలరాలి నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. కాగా ఉదయమంతా వేసవితాపంతో అల్లాడిన జనం కాసింత సేద తీరారు.

Updated Date - 2021-05-12T05:18:48+05:30 IST