ఉమ్మడి పశ్చిమలో Heavy rain

ABN , First Publish Date - 2022-05-09T00:49:01+05:30 IST

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భీమవరం

ఉమ్మడి పశ్చిమలో Heavy rain

భీమవరం: పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భీమవరం, వీరవాసరం, నరసాపురం, పెదవేగి, ముదినేపల్లి, చింతలపూడి, గణపవరం, భీమడోలు, పెదపాడు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కురిసిన భారీ వర్షానికి ధాన్యం రాశుల్లోకి నీరు చేరింది. వరి మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల 30 వేల ఎకరాలలో సాగు చేయగా లక్షా 30 వేల ఎకరాలు మాసూళ్ళు అయినప్పటికీ ఎక్కువ ధాన్యం రాశులు గాను, ధాన్యం ఎండ బెట్టే దశలోనూ ఉన్నాయి. వాటితోపాటు లక్షా పదివేల ఎకరాలు పంట చేనుగానే ఉంది. దీంతో రైతుల్లో పరుగులు, అలజడి వర్షం పెరిగేలా చేసింది. తుఫాన్‌ గండం ఉందని సూచన రావడంతో రైతులు మరింత కంగారు పడుతున్నారు. 

Read more