నీటమునిగిన ఇళ్లు

ABN , First Publish Date - 2021-05-14T06:11:51+05:30 IST

తాడేపల్లి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి స్థానిక బోటు యార్డు వద్ద ఉన్న పుష్కర బాధితుల కాలనీ నీట మునిగింది.

నీటమునిగిన ఇళ్లు
వచ్చిన వర్షపు నీటిలో ఉన్న వృద్ధులు

తాడేపల్లి టౌన్‌, మే13: తాడేపల్లి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి స్థానిక బోటు యార్డు వద్ద ఉన్న పుష్కర బాధితుల కాలనీ నీట మునిగింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం రావడంతో కాలనీ జలమయమైంది. నీరు బయటకు వెళ్లే దారిలేక ఇళ్లలోకి వచ్చి మోకాలు లోతులో నిలిచిపోయాయి. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా సీతానగరంలో తొలగించిన ఇళ్ల బాధితులకు నేటివరకు పక్కా స్థలాలు, ఇళ్లు కేటాయించకపోవడంతో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మునిసిపల్‌ అధికారులు స్పందించి వర్షపునీటిని బయటకు పంపి, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. 


నేలకొరిగిన వృక్షాలు


తాడేపల్లి ప్రాంతంలో గురువారం కురిసిన భారీవర్షం, ఈదురుగాలులలకు పలు ప్రాంతాలు జలమయం కాగా, వృక్షాలు నేలకొరిగాయి. తాడేపల్లి పాత జాతీయ రహదారి (గుంటూరు-విజయవాడ రహదారి) మార్గంలో డోలా్‌సనగర్‌ ప్రాంతంలో ఓ చెట్టుకింద నిలిపివున్న టాటా ఏస్‌ మినీ వాహనంపై భారీవృక్షం పడడంతో వాహనం దెబ్బతింది. సాయంత్రం సమయానికి మునిసిపల్‌ అధికారులు ఆ ప్రాంతానికి విచ్చేసి పడిపోయిన వృక్షాన్ని తొలగింపజేసి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చూశారు.


Updated Date - 2021-05-14T06:11:51+05:30 IST