హైదరాబాద్ జలాశయాలకు భారీగా నీరు.. పరిస్థితి చూస్తే..!

ABN , First Publish Date - 2022-07-27T04:09:37+05:30 IST

జంట జలాశయాలకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వికారాబాద్ , చేవెళ్ల ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో అధికంగా..

హైదరాబాద్ జలాశయాలకు భారీగా నీరు.. పరిస్థితి చూస్తే..!

హైదరాబాద్ (Hyderabad): జంట జలాశయాలకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వికారాబాద్ , చేవెళ్ల  ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో అధికంగా వరద నీరు  వచ్చి చేరుతోంది. ఉస్మాన్ ‌సాగర్ నుంచి 10 గేట్లు 6 ఫీట్ల  మేర  ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 5,800 క్యూసెక్కులు కాగా.. అవుట్  ఫ్లో  6090 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం  1787.75 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం  1790 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్‌కు 3500  క్యూసెక్కుల  ఇన్ ఫ్లో ఉంది.  మొత్తం 6 గేట్ల ద్వారా మూసిలోకి  3910 క్యూసెక్కుల నీరు విడుద చేశారు. సాగర్  ప్రస్తుత నీటిమట్టం 1761.25 అడుగులుగా ఉండగా పూర్తి స్థాయి  నీటి  మట్టం  1763.50 అడుగులుగా ఉంది. 

Updated Date - 2022-07-27T04:09:37+05:30 IST